News21st Nov 02:38 PMSunil Byrisetty1 min read

జలహారతి కార్యక్రమం లో పాల్గొన్న నారా భువనేశ్వరి

తుమ్మిసి పెద్ద చెరువులో జరిగిన జలహారతి కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. జల హారతి కార్యక్రమంలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతం అని పేర్కొన్నారు. తాగు,సాగు నీటికి ఇబ్బంది లేక

జలహారతి కార్యక్రమం లో పాల్గొన్న నారా భువనేశ్వరి
తుమ్మిసి పెద్ద చెరువులో జరిగిన జలహారతి కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. జల హారతి కార్యక్రమంలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతం అని పేర్కొన్నారు. తాగు,సాగు నీటికి ఇబ్బంది లేకుండా కృష్ణ జలాలను కుప్పం తీసుకొచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పారు. కుప్పంలో నీటి కరువు అనేది లేకుండా చూడటమే చంద్రబాబు లక్ష్యమన్నారు. కుప్పంతో పాటు రాష్ట్రంలో రైతులకు సాగునీరు ఇబ్బంది లేకుండా చంద్రబాబు నాయుడు చేస్తున్నారన్నారు. కుప్పానికి రూ. 23,000 కోట్లతో 7 పరిశ్రమలు తీసుకురావటం జరిగిందన్నారు. పరిశ్రమలతో పాటు టూరిజం డెవలప్మెంట్ కూడా కుప్పంలో జరుగుతుందని భువనేశ్వరి పేర్కొన్నారు.
Nara Bhuvaneswari
Jalaharathi
Tummisi Pedda Cheruvu
Kuppam
Chandrababu Naidu
Krishna Waters
Irrigation
Drinking water
రైతుల సమస్యలు
పరిశ్రమలు
టూరిజం డెవలప్‌మెంట్
నీటి కరువు
Scroll for the next article