News8th Nov 12:50 PMSunil Byrisetty1 min read

స్త్రీశక్తి హస్తకళా స్టోర్ ప్రారంభించనున్న నారా భువనేశ్వరి

హైదరాబాద్లో స్త్రీశక్తి హస్తకళా స్టోర్ ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 600 మంది స్త్రీ శక్తి విమెన్ అసోసియేషన్ సభ

స్త్రీశక్తి హస్తకళా స్టోర్ ప్రారంభించనున్న నారా భువనేశ్వరి
హైదరాబాద్లో స్త్రీశక్తి హస్తకళా స్టోర్ ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 600 మంది స్త్రీ శక్తి విమెన్ అసోసియేషన్ సభ్యులకు వివిధ హస్తకళల్లో ఉచిత శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన మహిళల ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం భువనేశ్వరి హైదరాబాద్ లో తొలి స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మహిళా సంక్షేమం, సాధికారిత కోసo దశాబ్దాలుగా సేవలందిస్తోంది. ఎన్టీఆర్ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ ద్వారా మహిళల విద్యాభివృద్ధికి కృషి చేస్తోంది. కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా వివిధ రకాల కోర్సుల్లో 20 నెలలుగా మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తోంది.
Andhra Pradesh
Telangana
Nara Bhuvaneswari
Sthree Shakti
NTR Trust
Handicrafts Store
Hyderabad
మహిళా సంక్షేమం
ఎన్టీఆర్ ట్రస్ట్ కాలేజ్
స్వయం సహాయక సంఘాలు
Scroll for the next article