News13th Aug 04:26 PMSunil Byrisetty1 min read

మంగళగిరి నియోజకవర్గంలో బ్రాహ్మణి పర్యటన

మంగళగిరి నియోజకవర్గంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ము

మంగళగిరి నియోజకవర్గంలో బ్రాహ్మణి పర్యటన
మంగళగిరి నియోజకవర్గంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ముందుగా మంగళగిరి పట్టణం గోలివారివీధిలో దామర్ల వేణు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన లక్ష్మీశారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ షోరూమ్ ను దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గొట్టిపాటి లక్ష్మితో కలిసి నారా బ్రాహ్మణి లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా గోలివారివీధికి చేరుకున్న నారా బ్రాహ్మణికి పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మంగళవాయిద్యాల మధ్య లక్ష్మీ శారీస్ వారి చేనేత వస్త్ర దుకాణాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. చేనేతకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు నారా లోకేష్ గట్టి పట్టుదలతో ఉన్నారని, మంగళగిరిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, గోల్డ్ హబ్, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధి, పార్క్ లు వంటి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని ఈ సందర్భంగా చెప్పారు. అందరం కలిసి చేనేత రంగాన్ని కాపాడుకుందామని అన్నారు. అనంతరం చేనేత చీరను కొనుగోలు చేశారు.
Andhra Pradesh
Nara Brahmani
Nara lokesh Mangalagiri
TDP
Handloom
Lakshmi Sarees
Development Works
Lakshmi Narasimha Swamy Temple
Parks
చేనేత
లక్ష్మీ శారీస్
అభివృద్ధి కార్యక్రమాలు
Scroll for the next article