News11th Jul 10:24 AMSunil Byrisetty1 min read

నారా బ్రాహ్మణికి 'ఫార్చ్యూన్ ఇండియా' అవార్డు

ఏపీ మంత్రి లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణికి 'ఫార్చ్యూన్ ఇండియా' మోస్ట్ పవర్ ఫుల్ విమెన్ జాబితాలో చోటు లభించింది. ఈ సందర్భంగా హెరిటేజ్ ఫుడ్స్ ప్రస్థానం, రైతుల సంక్షేమంపై ఫార్చ్యూన్ ఇం

నారా బ్రాహ్మణికి 'ఫార్చ్యూన్ ఇండియా' అవార్డు
ఏపీ మంత్రి లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణికి 'ఫార్చ్యూన్ ఇండియా' మోస్ట్ పవర్ ఫుల్ విమెన్ జాబితాలో చోటు లభించింది. ఈ సందర్భంగా హెరిటేజ్ ఫుడ్స్ ప్రస్థానం, రైతుల సంక్షేమంపై ఫార్చ్యూన్ ఇండియా సదస్సులో బ్రాహ్మణి మాట్లాడారు. దేశ ఆర్థిక వృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న మహిళా పారిశ్రామికవేత్తల జాబితాలో బ్రాహ్మణి నిలిచారు. ఢిల్లీలో జరిగిన సదస్సులో అవార్డు అందుకున్నారు. తన భార్య సాధించిన విజయంపై మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. 100 మంది అత్యంత ప్రభావవంతమైన మహిళల జాబితాలో నిలవడం గర్వకారణమని పేర్కొన్నారు. ప్రతిభ కొనసాగిస్తూ, నాయకత్వ లక్షణాలతో అవరోధాలను అధిగమించాలంటూ లోకేశ్ పోస్టు చేశారు. తనకు అవార్డు లభించడంపై హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి స్పందించారు. అరుదైన గుర్తింపును హెరిటేజ్ ఫుడ్స్ కుటుంబానికి, రైతులకు, ఉద్యోగులకు అంకితమిస్తున్నానని పేర్కొన్నారు.
Andhra Pradesh
Nara Brahmani
Fortune India
Most Powerful Women
Heritage Foods
Nara Lokesh
Women Leadership
Women Entrepreneurs
మహిళా పారిశ్రామికవేత్త
మహిళా నాయకత్వం
వ్యాపార రంగం
ఫార్చ్యూన్ ఇండియా అవార్డు
ఢిల్లీ
Scroll for the next article