News3rd Nov 05:07 PMSunil Byrisetty1 min read
మంగళగిరి చీరలో మెరిసిన బ్రాహ్మణి!
మంగళగిరి చేనేత చీరల ప్రత్యేకతను మరోసారి చాటిచెప్పారు నారా బ్రాహ్మణి. విజయవాడలోని శ్రీ శేషసాయి కల్యాణవేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రాఫ్
మంగళగిరి చేనేత చీరల ప్రత్యేకతను మరోసారి చాటిచెప్పారు నారా బ్రాహ్మణి. విజయవాడలోని శ్రీ శేషసాయి కల్యాణవేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రాఫ్ట్స్ అండ్ టెక్స్టైల్స్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ను ఈరోజు ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మరోసారి మంగళగిరి చేనేత చీర ధరించి కార్యక్రమానికి హాజరుకావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మంగళగిరి చేనేతపై నారా కుటుంబానికి ఉన్న అభిమానం, ఆ కళకు ఇస్తున్న ప్రాధాన్యత ఈ సందర్భంగా మరోసారి స్పష్టమైంది. నారా బ్రాహ్మణి ఇప్పటికే పలు సందర్భాల్లో మంగళగిరి నేత చీరలు ధరించి వాటి ప్రత్యేకతను ప్రజలకు పరిచయం చేస్తుండగా, నారా భువనేశ్వరి సైతం అనేక సందర్భాల్లో చేనేత చీరలు ధరించి సంప్రదాయ వస్త్రకళకు ప్రోత్సాహం అందిస్తున్నారు.