News14th Sep 03:19 PMSunil Byrisetty1 min read
ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్ గా నారా దేవాన్ష్
విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తనయుడు, పదేళ్ల యువ చెస్ ప్రాడిజీ నారా దేవాన్ష్ చదరంగంలో అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్ ను వేగంగా పరిష్కరించడం ద్వారా ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్ గ
విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తనయుడు, పదేళ్ల యువ చెస్ ప్రాడిజీ నారా దేవాన్ష్ చదరంగంలో అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్ ను వేగంగా పరిష్కరించడం ద్వారా ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్ గా ప్రపంచ రికార్డ్ సాధించాడు. అందుకుగాను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్స్-2025 అందుకున్నాడు. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ హాల్ లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొని “ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్-175 పజిల్స్” అవార్డ్ అందుకున్నాడు. ఈ కార్యక్రమానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ ఘనతను సాధించేందుకు నారా దేవాన్డ్ గతేడాది చెక్ మేట్ మారథాన్ లో లాస్లో పోల్గార్ ప్రసిద్ధ చెస్ సంకలనం ‘5334 ప్రాబ్లమ్స్ అండ్ గేమ్స్’ పుస్తకం నుంచి తీసుకున్న 175 సంక్లిష్టమైన చెక్ మేట్ పజిల్స్ ను వేగవంతంగా పరిష్కరించాడు. దీంతోపాటు దేవాన్ష్ మరో రెండు ప్రపంచ రికార్డులను కూడా గతంలో సొంతం చేసుకున్నాడు. 7-డిస్క్ టవర్ ఆఫ్ హనోయ్‌ను కేవలం 1 నిమిషం 43 సెకన్లలో పూర్తి చేయడం, 9 చెస్ బోర్డ్స్ పై 32 పావులను సరైన పద్ధతి ద్వారా 5 నిమిషాల్లో అమర్చడంలో ప్రపంచ రికార్డులు సాధించాడు.