Notifications10th Oct 03:09 PMSunil Byrisetty1 min read

ప్రతి ఏడాది డీఎస్సీ– ఉపాధ్యాయ నియామకాలపై లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న లక్షలాది నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వ

ప్రతి ఏడాది డీఎస్సీ– ఉపాధ్యాయ నియామకాలపై లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న లక్షలాది నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఈ ఏడాది నవంబర్ చివరి వారంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించాలని, 2026 జనవరిలో డీఎస్సీ, స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. మార్చిలో పరీక్షలు పూర్తి చేసి, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే కొత్త ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకునేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని లోకేశ్ తెలిపారు. ఇప్పటి వరకు తమ దృష్టికి వచ్చిన 423 వినతులలో 200 కేసులు పరిష్కరించబడ్డాయని, మిగతావి విధానపరమైన, ఆర్థికపరమైన అంశాలతో ముడిపడి ఉన్నాయని వివరించారు. ఉపాధ్యాయులు, అభ్యర్థులు టెట్, డీఎస్సీకి ఇప్పటి నుంచే సన్నద్ధమవ్వాలని పిలుపునిచ్చారు.
Andhra Pradesh
DSC 2025
Teacher Jobs
Nara Lokesh
AP Teachers
DSC Notification
Special DSC
AP TET
Teacher Recruitment
డీఎస్సీ నోటిఫికేషన్
స్పెషల్ డీఎస్సీ
Scroll for the next article