News16th Jul 04:24 PMSunil Byrisetty1 min read

ఏపీ తరఫున క్షమాపణలు

‘ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి’ అంటూ జయదేవ్ గల్లాకు మంత్రి నారా లోకేష్ బహిరంగ క్షమాపణ చెప్పారు. గత ప్రభుత్వంలో 'అమరరాజా' వేధింపులకు గురైందని ట్వీట్లో విమర్శించారు. సొంత రాష్ట్

ఏపీ తరఫున క్షమాపణలు
‘ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి’ అంటూ జయదేవ్ గల్లాకు మంత్రి నారా లోకేష్ బహిరంగ క్షమాపణ చెప్పారు. గత ప్రభుత్వంలో 'అమరరాజా' వేధింపులకు గురైందని ట్వీట్లో విమర్శించారు. సొంత రాష్ట్రంలో ప్రోత్సాహం దక్కాల్సిన సంస్థకు ఇబ్బందులు ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ మళ్లీ పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా మారిందని స్పష్టం చేశారు. 'అమరరాజా' భవిష్యత్ విస్తరణలో ఏపీ కీలక పాత్ర పోషించాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు. తెలంగాణలో కొత్త తయారీ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న 'అమరరాజా'కు శుభాకాంక్షలు తెలిపారు.
Andhra Pradesh
Nara Lokesh
Jayadev Galla
Amara Raja
Investments
Industry
Manufacturing
పారిశ్రామిక అభివృద్ధి
తెలంగాణ
ఏపీ రాజకీయాలు
తయారీ రంగం
Scroll for the next article