Politics8th Mar 03:09 PMSunil Byrisetty1 min read
డిప్యూటీ సీఎంపై మంత్రి లోకేష్ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రాన్ని ఎవరు పాలించాలనేది ప్రజలే నిర్ణయించాలని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఎవరు డిప్యూటీ సీఎం కావాలనేది సీఎం ఇష్టమని తేల్చి చెప్పారు. రిపబ్లిక్ కాంక్లేవ్ లో పాల
రాష్ట్రాన్ని ఎవరు పాలించాలనేది ప్రజలే నిర్ణయించాలని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు.
ఎవరు డిప్యూటీ సీఎం కావాలనేది సీఎం ఇష్టమని తేల్చి చెప్పారు.
రిపబ్లిక్ కాంక్లేవ్ లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
మనమిత్ర పథకం ద్వారా ఏపీలో వాట్సప్ సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు.
టాటా పవర్ లో 7 గిగా వాట్స్ ఒప్పందం...AIకి అందరూ సిద్దంగా ఉండాలని చెప్పారు.
రెడ్‍బుక్ మెయింటైన్ చేస్తున్నామని మరోసారి వ్యాఖ్యానించారు. వైసీపీ పాలన ఇసుక అక్రమ రవాణా జరిగిందన్నారు.
దీనిపై సుప్రీం కోర్టులో కేసు కూడా నడుస్తోందన్నారు. ఎన్డీఏకు బేషరుతు మద్దతు ఇచ్చామని, ఇప్పుడు సుపరిపాలన అందిస్తున్నామని మంత్రి వివరించారు.