News22nd Sep 03:41 PMSunil Byrisetty1 min read

స్థానిక ఎన్నికల్లో 94 శాతం మించి గెలవాలి

‘మా ఉపాధ్యాయుల జోలికొస్తే.. దబిడి దిబిడే. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. డీఎస్సీపై చర్చకు నేను సిద్ధం. జగన్ సిద్ధమా’ అని మంత్రి నారా లోకేష్ మరోసారి సవాల్ చేశారు. అనంతపురం జిల్లా

స్థానిక ఎన్నికల్లో 94 శాతం మించి గెలవాలి
‘మా ఉపాధ్యాయుల జోలికొస్తే.. దబిడి దిబిడే. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. డీఎస్సీపై చర్చకు నేను సిద్ధం. జగన్ సిద్ధమా’ అని మంత్రి నారా లోకేష్ మరోసారి సవాల్ చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు కూడలిలో ఏర్పాటుచేసిన స్వర్గీయ నందమూరి తారకరామారావు, మాజీ మంత్రి స్వర్గీయ పరిటాల రవీంద్ర విగ్రహాలను మంత్రి లోకేష్ ఆవిష్కరించారు. ‘ఈ రోజు మనం వేదికపై ఉన్నామంటే కారణం వేదిక కింద ఉన్న టీడీపీ కార్యకర్తల త్యాగం వల్లే. ఈ రోజు నేను స్వర్గీయ ఎన్టీఆర్ మనవడిగా, సీఎం చంద్రబాబు తనయుడిగా, బాలయ్య మావయ్య అల్లుడిగా రాలేదు. ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడమ తిప్పకుండా, టీడీపీకి కాపలాకాసిన కార్యకర్తగా ఇక్కడకు వచ్చాను. అన్న ఎన్టీఆర్ గారు ఏ ముహూర్తంలో పార్టీని స్థాపించారో తెలియదు. నాకు అక్కతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్లు లేరు, కానీ కోటి మంది కుటుంబ సభ్యులను ఇచ్చారు. మీ పౌరుషమే వేరు. అన్న ఎన్టీఆర్ పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. రాజకీయాల్లో, సినిమాల్లో స్వర్గీయ ఎన్టీఆర్ గారి స్టైలే వేరు. ఆనాడు యువగళంలో దారిపొడవునా ప్రజలు నాకు నీరాజనాలు పలికారు. పెద్దఎత్తున ఘనస్వాగతం పలికారు. ఆనాటి సంబరం మళ్లీ ఈనాడు చూస్తున్నా’నని పేర్కొన్నారు.
Scroll for the next article