News15th May 06:15 PMSunil Byrisetty1 min read

ఏడాది పాలనలో చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ప్రతి కార్యకర్త మన ప్రభుత్వం చేసింది చెప్పుకోవాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా రూ. 4 వేల పెన్షన్ ఇవ్వడం లేదని, అవ్వతాతలకు అండగా నిలిచేందుకే పెన్షన్ ప

ఏడాది పాలనలో చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ప్రతి కార్యకర్త మన ప్రభుత్వం చేసింది చెప్పుకోవాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా రూ. 4 వేల పెన్షన్ ఇవ్వడం లేదని, అవ్వతాతలకు అండగా నిలిచేందుకే పెన్షన్ పెంచామని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లిస్తున్నామని, వాటి గురించి పార్టీ కార్యకర్తలంతా ప్రజల్లోకి వెళ్లి మాట్లాడాలని అన్నారు. గుంతకల్లు నియోజకవర్గం రామరాజుపల్లిలో ఉత్తమ కార్యకర్తల సమావేశంలో యువనేత లోకేష్ మాట్లాడారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్లే కసితో పనిచేయాలని సూచించారు. బాబు సూపర్ – 6, బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీలో పార్టీ తరపున పలు హామీలు ఇచ్చామని, ఒక్కొక్కటిగా వాటిని అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 11నెలల ప్రజాప్రభుత్వంలో వృద్ధాప్య పెన్షన్ రూ. 4 వేలకు, దివ్యాంగ పెన్షన్ 6 వేలకు పెంచామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా పేదల ఆకలితీర్చే అన్నక్యాంటీన్లు ప్రారంభించామన్నారు. ఉచిత గ్యాస్ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. జూన్ మాసంలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు ఇస్తామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలుచేస్తూ ముందుకెళ్తున్నామని లోకేష్ వివరించారు.
Andhra Pradesh
Nara Lokesh
Super Six Schemes
బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ
గుంతకల్లు నియోజకవర్గం రామరాజుపల్లి
Scroll for the next article