News9th Sep 04:01 PMSunil Byrisetty1 min read

ఎన్నారైల అండతో టీడీపీ జెండా రెపరెపలు

ఎన్ఆర్ఐలు అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ అని, ఎన్నారైల అండతో టీడీపీ జెండా రెపరెపలాడిందని ఆ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అన్నారు. ఎన్ఆర్ఐ టీడీపీ సెంట్రల్ కమిటీ ప్రమ

ఎన్నారైల అండతో టీడీపీ జెండా రెపరెపలు
ఎన్ఆర్ఐలు అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ అని, ఎన్నారైల అండతో టీడీపీ జెండా రెపరెపలాడిందని ఆ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అన్నారు. ఎన్ఆర్ఐ టీడీపీ సెంట్రల్ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. మంచి ఉద్యోగాలు చేస్తున్నా.. నమ్ముకున్న పార్టీ కోసం, తెలుగుజాతి కోసం నిలబడ్డారని ఎన్నారైలని కొనియాడారు. "మీ పిల్లలకు అద్భుతమైన తెలుగు నేర్పిస్తున్నారు. తెలుగుతనం ఏనాడూ మర్చిపోలేదు. సొంత గ్రామాలపై మమకారం, సేవాభావం ఎక్కువ. మీరు చదువుకున్న పాఠశాలల అభివృద్ధికి కోట్ల రూపాయలు వెచ్చించారు. అదీ మీ కమిట్ మెంట్. ఇందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. తెలుగుజాతి గురించి ఆలోచించే పార్టీ తెలుగుదేశం పార్టీ. టీడీపీ అధికారంలో ఉన్నా, లేకపోయినా ఉత్తరాఖండ్ వరదల సమయంలో ప్రత్యేక విమానం పెట్టి తెలుగువారిని రక్షించాం. ఉక్రెయిన్ పై దాడుల సమయంలో తెలుగువారికి అండగా సీబీఎన్ నిలిచారు. ఎన్ఆర్ఐలు తెలుగుజాతికి బ్రాండ్ అంబాసిడర్లు. తెలుగుజాతిని నెం.1గా చేసే బాధ్యత తీసుకుందాం. ఇందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. మీరు పనిచేసే కంపెనీలు ఏపీకి వచ్చేందుకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి. దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి వస్తున్నాయి. ఏపీ అభివృద్ధిలో ఎన్ఆర్ఐలు భాగస్వామ్యం కావాల"ని లోకేష్ పిలుపునిచ్చారు.
Andhra Pradesh Development
Nara Lokesh
NRI TDP
TDP
Telugu Desam Party
NRI Telugu Community
NRI TDP Central Committee
Telugu People
తెలుగు ప్రవాసులు
ఏపీ పెట్టుబడులు
ఎన్నారైల మద్దతు
టీడీపీ రాజకీయాలు
ఏపీ రాజకీయాలు
Scroll for the next article