News11th Sep 04:50 PMSunil Byrisetty1 min read

పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు సాధించాలి

విద్యాశాఖకు సంబంధించి వివిధ అంశాలపై కలెక్టర్లకు మంత్రి నారా లోకేష్ పలు సూచనలు చేశారు. పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు సాధించేలా కలెక్టర్లు కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. బోర్డు పరీక్

పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు సాధించాలి
విద్యాశాఖకు సంబంధించి వివిధ అంశాలపై కలెక్టర్లకు మంత్రి నారా లోకేష్ పలు సూచనలు చేశారు. పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు సాధించేలా కలెక్టర్లు కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం మరింతగా పెరిగేలా చూడాలన్నారు. పాఠశాల భవనాలు పటిష్టంగా ఉండాలి. నిర్మాణాలు నాణ్యంగా ఉండాలని సూచించారు. ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలను వివిధ పరిశ్రమలతో అనుసంధానిస్తూ.. పరిశ్రమలకు తగిన నైపుణ్యాలను అందిపుచ్చుకునేలా చేస్తున్నామన్నారు. నైపుణ్యం వెబ్ పోర్టల్ ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు స్కిల్ టూల్స్ కూడా అందుబాటులోకి తెస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అక్షరాస్యతతో పాటు డిజిటల్, ఫైనాన్షియల్ లిటరసీపైనా విద్యాశాఖ పని చేస్తోందన్నారు. పాఠశాలల్లోని విద్యార్ధులకు ప్రకృతి విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్వయం రక్షణపైనా శిక్షణ ఇస్తున్నామని వివరించారు. కరిక్యులమ్ మార్పుపై రోడ్ మ్యాప్‌ను రూపొందించుకుని పని చేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు.
Andhra Pradesh Education
Nara Lokesh
Education Minister
School Education
100 Percent Results
Board Exams
District Collectors
School Infrastructure
నైపుణ్యం పోర్టల్
డిజిటల్ అక్షరాస్యత
ఆర్థిక అక్షరాస్యత
కరిక్యులమ్ సంస్కరణలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు
Scroll for the next article