Education27th Jul 04:36 PMSunil Byrisetty1 min read

మీకు మార్కులు రాకపోతే నా మార్కులు కట్1

విద్యారంగంలో సంస్కరణలు పూర్తయ్యాయని, ఫలితాలపై దృష్టిపెట్టాలని అధికారులను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడులోని జడ్పీ ఉన్నత పాఠశ

మీకు మార్కులు రాకపోతే నా మార్కులు కట్1
విద్యారంగంలో సంస్కరణలు పూర్తయ్యాయని, ఫలితాలపై దృష్టిపెట్టాలని అధికారులను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడులోని జడ్పీ ఉన్నత పాఠశాలను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో వసతులు, విద్యా ప్రమాణాలపై మంత్రి ఆరా తీశారు. ముందుగా పాఠశాలలోని పదో తరగతి ‘ఏ’ సెక్షన్ విద్యార్థులతో మంత్రి సంభాషించారు. ‘మీ సీనియర్స్ కంటే మీరు బాగా చదవాలి. గతేడాది పదో తరగతిలో 67శాతం మంది విద్యార్థులు మొదటి ప్రయత్నంలో ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్ర సరాసరి కంటే ఇది 11 శాతం తక్కువ. మీకు మార్కులు రాకపోతే సీఎం చంద్రబాబునాయుడు నా మార్కులు తగ్గిస్తారు. కాబట్టి మీరంతా బాగా చదవాల’ని వారిని ఉత్సాహపరిచారు. పాఠశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేయాలని సూచించారు.
Andhra Pradesh
Education Minister
Nara Lokesh
School Inspection
Government School
Students
Krishna District
Kankipadu
విద్యా సంస్కరణలు
పదో తరగతి
విద్యా ప్రమాణాలు
చంద్రబాబు నాయుడు
ప్రభుత్వ విద్య
Scroll for the next article