News10th Aug 10:19 AMSunil Byrisetty1 min read

లోకేష్ అరుదైన ఘనత.. కవర్ పేజీపై కథనం

మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. వర్కింగ్ ప్రెసిడెంట్ గా అటు పార్టీ, మంత్రిగా ఇటు ప్రభుత్వ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ పత్

లోకేష్ అరుదైన ఘనత.. కవర్ పేజీపై కథనం
మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. వర్కింగ్ ప్రెసిడెంట్ గా అటు పార్టీ, మంత్రిగా ఇటు ప్రభుత్వ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ పత్రిక ఫార్చ్యూన్ ఇండియా ఆగస్టు సంచిక కవర్ పేజీ పై లోకేష్ ఫొటోను ప్రచురించింది. “ఆంధ్రాస్ రైజింగ్ స్టార్: హౌ నారా లోకేష్ ఈజ్ పవర్ ప్యాకింగ్ ద స్టేట్స్ నెక్స్ట్ చాప్టర్” అనే శీర్షికతో ఈ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ప్రతిష్టాత్మక 40 అండర్ 40′ శ్రేణిలో భాగంగా లోకేష్‌ను ఏపీ ముఖ్య నాయకుడిగా హైలైట్ చేసింది. ఏపీకి పెట్టుబడులను రప్పించడంలో ఆయన చొరవను పత్రిక పేర్కొంది. ఫార్చ్యూన్ కథనం జాతీయస్థాయిలో పొలిటికల్ సర్కిళ్లలో చర్చనీయాంశంగా మారింది.
Andhra Politics
Chandrababu Naidu
Investments
Nara Lokesh
Fortune India
Fortune India 40 Under 40
పెట్టుబడులు
ఆర్థిక అభివృద్ధి
రాజకీయ నాయకత్వం
ఏపీ ప్రభుత్వం
రైజింగ్ స్టార్
Scroll for the next article