News16th Oct 03:32 PMSunil Byrisetty1 min read

జిఎస్టీ పొదుపు ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

సూపర్ జిఎస్ టి – సూపర్ సేవింగ్స్ పై కర్నూలు జిల్లాలోని వివిధ స్కూళ్లలో నిర్వహించిన పలు పోటీల్లో విజేతలైన విద్యార్థులను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అభ

జిఎస్టీ పొదుపు ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
సూపర్ జిఎస్ టి – సూపర్ సేవింగ్స్ పై కర్నూలు జిల్లాలోని వివిధ స్కూళ్లలో నిర్వహించిన పలు పోటీల్లో విజేతలైన విద్యార్థులను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు చెక్ పోస్టు సభావేదిక సమీపాన క్యాంపులో.. జిఎస్టీపై నిర్వహించిన డ్రాయింగ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు గవర్నర్ అబ్ధుల్ నజీర్, మంత్రి లోకేష్ ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులతో ముచ్చటించిన లోకేష్ వారిని అభినందించారు. ప్రధాని మోడీజీ నేతృత్వంలో తెచ్చిన జిఎస్టీ సంస్కరణల వల్ల రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఏటా రూ.15వేల లబ్ధి చేకూరుతుందని చెప్పారు. జిఎస్టీ సేవింగ్స్ ప్రయోజనాలపై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించాలని కోరారు.
Andhra Pradesh
Nara Lokesh
GST Savings
Kurnool
Education
Student Competitions
Super GST
Public Awareness
GST Benefits
Narendra Modi
Abdul Nazeer
ఐటీ మంత్రి ఏపీ
పన్ను సంస్కరణలు
సూపర్ సేవింగ్స్
కర్నూలు ఈవెంట్స్
Scroll for the next article