News25th Jul 01:21 PMSunil Byrisetty1 min read
అత్యుత్తమంగా మంగళగిరి జ్యుయలరీ పార్కు!
మంగళగిరి జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్కును దేశంలో అత్యుత్తమ మోడల్‌లో నిర్మించాలని విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరిలో ఏర్పాటు చేయబోతున్న జెమ్స్
మంగళగిరి జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్కును దేశంలో అత్యుత్తమ మోడల్‌లో నిర్మించాలని విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరిలో ఏర్పాటు చేయబోతున్న జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్కుతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కామన్ ఫెసిలిటీ సెంటర్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. ఇందులో ఆభరణాల తయారీలో ప్రపంచస్థాయి శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. దేశంలో టాప్ 20 ఆభరణాల తయారీసంస్థలు మంగళగిరి పార్కులో తయారీ యూనిట్లు, రిటైల్ షాపులు స్థాపించేలా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఉడిపిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెమ్స్ అండ్ జ్యుయలరీ (ఐఐజిజె) పనితీరును అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. ప్రతిఏటా 4వేలమందికి అధునాతన ఆభరణాల తయారీలో శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.