News6th Aug 11:36 AMSunil Byrisetty1 min read

మరో యువగళం హామీని నెరవేర్చిన మంత్రి లోకేష్

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మరో యువగళం హామీని నెరవేర్చారు. కర్నూలు పట్టణం అశోక్ నగర్‌లోని నగరపాలక సంస్థ పంప్ హౌస్ ప్రాంతంలో నాలుగు దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలంలో నివాసం ఉంటున్

మరో యువగళం హామీని నెరవేర్చిన మంత్రి లోకేష్
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మరో యువగళం హామీని నెరవేర్చారు. కర్నూలు పట్టణం అశోక్ నగర్‌లోని నగరపాలక సంస్థ పంప్ హౌస్ ప్రాంతంలో నాలుగు దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలంలో నివాసం ఉంటున్న 150 మంది గూడెం కొట్టాలు వాసులకు శాశ్వత ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. నిరుపేదలైన వీరు గూడెం కొట్టాల ప్రాంతంలో పూరి గుడిసెలు వేసుకుని నాలుగు దశాబ్దాలుగా నివాసం ఉంటున్నారు. తమకు శాశ్వత పట్టాలు ఇవ్వాలని ఏళ్లుగా ప్రజాప్రతినిధులను కోరుతున్నా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. యువగళం పాదయాత్రలో భాగంగా కర్నూలు వచ్చిన నారా లోకేష్ ను అప్పటి కర్నూలు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ టీజీ భరత్ నేతృత్వంలో గూడెం కొట్టాలు వాసులు కలిసి తమకు శాశ్వత పట్టాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన నారా లోకేష్... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాశ్వత పట్టాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వంలో 2025 జనవరిలో తీసుకువచ్చిన జీవో నెంబర్ 30 ద్వారా కోట్ల విలువ చేసే సుమారు ఎకరా స్థలాన్ని నిరుపేదలకు అప్పగించారు. మంత్రి టీజీ భరత్ చేతుల మీదుగా 150 మంది నిరుపేదలకు శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేశారు.
Nara Lokesh
Yuvagalam
Kurnool
Housing Patta
IT Minister
Education Minister
TG Bharat
Ashok Nagar
Kurnool Municipality
Poor Families
Government Land
Permanent Housing
యువగళం హామీని నెరవేర్చిన మంత్రి లోకేష్
Scroll for the next article