News4th Apr 10:42 AMSunil Byrisetty1 min read

గోవిందుకు బట్టలు పెట్టి పట్టా అందించిన లోకేష్!

ఉండవల్లిలోని కొండవాలు ప్రాంతంలో రాజమండ్రి గోవిందు కుటుంబం గత పదిహేనేళ్లుగా ఇల్లు నిర్మించుకొని జీవనం సాగిస్తోంది. అది కొండ పోరంబోకు కావడంతో ఇప్పటివరకు ఆ ఇంటిపై వారికి ఎటువంటి అధికా

గోవిందుకు బట్టలు పెట్టి పట్టా అందించిన లోకేష్!
ఉండవల్లిలోని కొండవాలు ప్రాంతంలో రాజమండ్రి గోవిందు కుటుంబం గత పదిహేనేళ్లుగా ఇల్లు నిర్మించుకొని జీవనం సాగిస్తోంది. అది కొండ పోరంబోకు కావడంతో ఇప్పటివరకు ఆ ఇంటిపై వారికి ఎటువంటి అధికారిక హక్కులు లేవు. మంగళగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గురువారం గోవిందు ఇంటికి వెళ్లి బట్టలు పెట్టి మరీ శాశ్వత ఇంటి పట్టాను అందజేశారు. దీంతో గోవిందు కుటుంబం ఆనందంతో పొంగిపోయింది. మరో 30ఏళ్లు మంగళగిరికి మీరే ఎమ్మెల్యేగా ఉండాలయ్యా అని గోవిందు కుటుంబసభ్యులు లోకేష్ కు దీవెనలు అందించింది. ఇల్లు నిర్మించుకున్న తర్వాత పట్టా కోసం పదిహేనేళ్లుగా ఎన్నోసార్లు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. మీరు మాకు చేసిన సాయం జీవితంలో మరువలేమన్నారు. దీనికి మంత్రి లోకేష్ స్పందిస్తూ... నాపై ఎంతో నమ్మకంతో 91వేల మెజారిటీతో నన్ను మీరు గెలిపించారు, ఇంత భారీ మెజారిటీ ఇస్తారని నేను కూడా ఊహించలేదు. మీ కల నెరవేర్చడం మంగళగిరి ఎమ్మెల్యేగా నా బాధ్యత. మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నవాళ్లంతా నావాళ్లే. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఇదే తరహాలో నివసిస్తున్న పేదలకు మంగళగిరిలో మేం చేసిన మోడల్ ఉపయోగపడుతుంది. ఉదయం 10.59 గంటల ముహూర్తానికి బట్టలుపెట్టి పట్టాను గోవిందు కుటుంబానికి అందజేశారు.
Nara Lokseh
free house pattas
ఉండవల్లి
రాజమండ్రి గోవిందు కుటుంబం
Scroll for the next article