News7th Dec 01:48 PMSunil Byrisetty1 min read
ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం
ప్రతిపక్షంలో అండగా నిలిచిన ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం, మా కుటుంబానికి మీరు కొండంత బలం ఇచ్చారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమెరికా డల్లాస్
ప్రతిపక్షంలో అండగా నిలిచిన ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం, మా కుటుంబానికి మీరు కొండంత బలం ఇచ్చారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమెరికా డల్లాస్ లోని కర్టిస్ కల్ వెల్ సెంటర్ లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ముందుగా శ్రీ హరిహరపీఠం వేదపండితులు మంత్రి లోకేష్ కు వేదాశీర్వచనాలు అందించారు. అనంతరం ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ ప్రసంగిస్తూ.. ఈ సమావేశానికి విచ్చేసిన నాకు ప్రాణసమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన, బీజేపీ కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలిపారు. అమెరికాలో ఉన్నానా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నానా అనే అనుమానం వచ్చిందన్నారు. మీ జోష్ చూస్తుంటే.. నా యువగళం పాదయాత్ర రోజులు గుర్తుకువస్తున్నాయన్నారు. చంద్రబాబుని 53 రోజులు పాటు అక్రమంగా బంధించినప్పుడు అమెరికాలోని ప్రవాసాంధ్రులు పెద్దఎత్తున బయటకు వచ్చి మాకు అండగా నిలిచారని గుర్తు చేశారు.