News27th Jul 02:49 PMSunil Byrisetty1 min read
ఎన్ఆర్ఐలే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్లు!
చంద్రబాబు పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న నమ్మకమే మన పెట్టుబడి అని మంత్రి నారా లోకేష్ అన్నారు. మన రాష్ట్రంలో ఉన్న అవకాశాలను ప్రచారం చేసి పెట్టుబడులు రాబడదామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్
చంద్రబాబు పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న నమ్మకమే మన పెట్టుబడి అని మంత్రి నారా లోకేష్ అన్నారు. మన రాష్ట్రంలో ఉన్న అవకాశాలను ప్రచారం చేసి పెట్టుబడులు రాబడదామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. సింగపూర్ ఓవిస్ ఆడిటోరియంలో ఎపిఎన్ఆర్ టి ఆధ్వర్యాన నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశానికి మంత్రి లోకేష్ అతిధిగా పాల్గొన్నారు. ఎన్నారైలే మా బ్రాండ్ అంబాసిడర్లు అన్నారు. రాష్ట్రాభివృద్ధిలో ఎన్ఆర్ఐ లంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మన దేశానికి వచ్చే విదేశీ పెట్టుబడుల్లో సింగపూర్ నుంచే అధికశాతం ఉంటాయన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం మొత్తం $81.04 బిలియన్ల విదేశీ ప్రత్యక్ష పెట్టబడులు వస్తే, అందులో సింగపూర్ నుంచే దాదాపు $14.94 బిలియన్ల పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. మొత్తం ఎఫ్ డిఐలలో సింగపూర్ నుండి 19శాతం ఉన్నాయని, పెట్టుబడుల్లో అధికశాతం ఏపీకి వస్తే మన రాష్ట్రం మరో సింగపూర్ అవుతుందని వివరించారు.