News2nd Sep 03:50 PMSunil Byrisetty1 min read

సీకే దిన్నెలో స్మార్ట్ కిచెన్ ప్రారంభం

రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా చింతకొమ్మ దిన్నె మండలంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఏర్పాటు చేసిన స్మార్ట్ కిచెన

సీకే దిన్నెలో స్మార్ట్ కిచెన్ ప్రారంభం
రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా చింతకొమ్మ దిన్నె మండలంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఏర్పాటు చేసిన స్మార్ట్ కిచెన్‌ను ప్రారంభించారు. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన కొత్త వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్మార్ట్ కిచెన్ ప్రారంభంతో విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించడానికి మరింత సమర్థవంతమైన సదుపాయాలు కలుగుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి పాల్గొన్నారు.
Andhra Pradesh
Nara Lokesh
Smart Kitchen
CK Dinne
Kadapa District
Midday Meal Scheme
పరిశుభ్రమైన ఆహారం
ప్రభుత్వ కార్యక్రమం
విద్యాశాఖ
ఐటీ శాఖ
నాణ్యమైన భోజనం
Scroll for the next article