News20th Mar 11:35 AMSunil Byrisetty1 min read

అప్పుడు మాటిచ్చా.. ఇప్పుడు నిలబెట్టుకున్నా!

భారతదేశంలోని ఆటోమొబైల్ రంగంలో రెండో అతిపెద్ద వాహన తయారీ సంస్థగా పేరుపొందిన ''అశోక్ లేలాండ్ ప్లాంట్‌ను మంత్రి నారా లోకేష్ మల్లవల్లిలో ప్రారంభించారు. యువగళం పాదయాత్రలో, గన్నవరం వచ్చి

అప్పుడు మాటిచ్చా.. ఇప్పుడు నిలబెట్టుకున్నా!
భారతదేశంలోని ఆటోమొబైల్ రంగంలో రెండో అతిపెద్ద వాహన తయారీ సంస్థగా పేరుపొందిన ''అశోక్ లేలాండ్ ప్లాంట్‌ను మంత్రి నారా లోకేష్ మల్లవల్లిలో ప్రారంభించారు. యువగళం పాదయాత్రలో, గన్నవరం వచ్చినప్పుడు, మల్లవల్లిలో అశోక్ లేలాండ్ ప్లాంట్ మళ్ళీ ప్రారంభిస్తామని హామీ ఇచ్చానని గుర్తు చేశారు. ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకున్నామని చెప్పారు. ఆంధ్ర రాష్ట్రానికి "బాబు" అనే బ్రాండ్ తో, అనేక పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. ఈ ప్లాంట్ అశోక్ లేలాండ్‌కు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందన్నారు. అశోక్ లేలాండ్ కు కేటాయించిన 75 ఎకరాల్లో 40 ఎకరాల్లో ప్లాంటును అభివృద్ధి చేశారని వివరించారు. ఈ ప్లాంట్ ఏటా 4,800 బస్సులను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉందని చెప్పారు. ఈ ప్లాంట్ ద్వారా మొదటిదశలో 600 ఉద్యోగాలు, రెండో దశలో 1,200 మందికి ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి లోకేష్ తెలిపారు.
Nara Lokesh
s Ashok Leyland
Mallavalli
ఆటోమొబైల్
Scroll for the next article