Education2nd Sep 03:39 PMSunil Byrisetty1 min read
నర్సరావుపేట జేఎన్ టీయూకేలో నూతన హాస్టల్ భవనాలు
పల్నాడు జిల్లాలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటించారు. నర్సరావుపేట మండలం కాకాని గ్రామంలోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, కాకినాడ(JNTUK) యూనివర్సిటీ ఇంజనీరిం
పల్నాడు జిల్లాలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటించారు. నర్సరావుపేట మండలం కాకాని గ్రామంలోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, కాకినాడ(JNTUK) యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు గౌతమి, కృష్ణవేణి, నాగార్జున పేర్లతో నూతనంగా నిర్మించిన మూడు హాస్టల్ భవనాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ముందుగా కళాశాల ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు కాలేజీ యాజమాన్యం, విద్యార్థులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. అనంతరం రూ.70 కోట్ల వ్యయంతో 1,600 మంది విద్యార్థులకు అత్యాధునిక వసతులతో నిర్మించిన నూతన వసతి గృహాలను మంత్రి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం హాస్టల్ మొత్తం కలియతిరిగి వసతులను పరిశీలించారు.