News27th Jan 03:53 PMSunil Byrisetty1 min read

కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పులు రావాలి

"మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పులు రావాలి. తెలుగుదేశం పార్టీ బలం, బలగం కార్యకర్తలు. పార్టీ అంటే కమిట్ మెంట్ ఉంది కాబట్టే పార్టీ కమిటీల్లో బాధ్యత కల్పించాం. దేశంలో అభివ

కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పులు రావాలి
"మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పులు రావాలి. తెలుగుదేశం పార్టీ బలం, బలగం కార్యకర్తలు. పార్టీ అంటే కమిట్ మెంట్ ఉంది కాబట్టే పార్టీ కమిటీల్లో బాధ్యత కల్పించాం. దేశంలో అభివృద్ధి, సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ సీబీఎన్. అనేక పరిశ్రమలు ఏపీకి వస్తున్నాయంటే కారణం చంద్రబాబు" అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంట్ కమిటీ వర్క్ షాప్ ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ శిక్షణా తరగతులకు ఇటీవల నియమించిన 25 పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు కమిటీ సభ్యులందరూ హాజరయ్యారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. "ఈ సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ శుభాకాంక్షలు. పార్టీ అంటే కమిట్ మెంట్ ఉన్నవారు కనుకనే ఈ రోజు పార్టీ కమిటీల్లో బాధ్యత కల్పించడం జరిగింది. పార్లమెంట్ కమిటీల్లో మొదటిసారి ఎన్నికైన వారు 83శాతం మంది ఉన్నారు. సీనియర్లను, జూనియర్లను నేను సమానంగా గౌరవిస్తాను, పనిచేసే వారిని ప్రోత్సహిస్తాను. దానికి మీరో ఉదాహరణ" అని వివరించారు.
Andhra Pradesh
Telugu Desam Party
TDP
Nara Lokesh
N Chandrababu Naidu
Party Reforms
TDP Cadre
Parliament Committee Workshop
ఏపీ రాజకీయాలు
పార్టీ కమిటీలు
నాయకత్వం
అభివృద్ధి
సంక్షేమం
Scroll for the next article