News24th Sep 12:26 PMSunil Byrisetty1 min read
మెగా డిఎస్సీ వేడుకలకు ఎమ్మెల్యేలకు ఆహ్వానం
రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు మెగా డిఎస్సీ ఫైలుపైనే తొలి సంతకం చేశారని, దీనిద్వారా సుమారు 16వేలమందికి టీచర్ ఉద్యోగాలు రాబోతున్నాయని మంత్
రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు మెగా డిఎస్సీ ఫైలుపైనే తొలి సంతకం చేశారని, దీనిద్వారా సుమారు 16వేలమందికి టీచర్ ఉద్యోగాలు రాబోతున్నాయని మంత్రి నారా లోకేష్ చెప్పారు. గత అయిదేళ్లలో ఒక్క డిఎస్సీ ఏర్పాటు చేయలేదన్నారు. నోటిఫికేషన్ దగ్గర నుంచి ఎగ్జామ్స్, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. గురువారం కొత్త ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతులమీదుగా నియామక ఉత్తర్వులు అందించబోతున్నామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వానికి గర్వకారణమైన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలంతా హాజరై జయప్రదం చేయాల్సింది కోరుతున్నామన్నారు. ప్రతిపక్ష సభ్యులకు కూడా జిఎడి ద్వారా ఆహ్వానం పంపించామని. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా వారిని కూడా కోరుతున్నామని మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు.