News10th Jul 12:33 PMSunil Byrisetty1 min read
ఏపీ సముద్ర రవాణా, షిప్ బిల్డింగ్ రంగంలో పెట్టుబడులు
దక్షిణ కొరియా పెట్టుబడుల యాత్రలో భాగంగా రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పారిశ్రామికవేత్తలతో వరుసగా సమావేశమవుతున్నారు. హెచ్ డి కొరియా షిప్‌బిల్డింగ్ & ఆఫ్
దక్షిణ కొరియా పెట్టుబడుల యాత్రలో భాగంగా రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పారిశ్రామికవేత్తలతో వరుసగా సమావేశమవుతున్నారు. హెచ్ డి కొరియా షిప్‌బిల్డింగ్ & ఆఫ్‌షోర్ ఇంజనీరింగ్ (HD KOSE) గ్లోబల్ బిజినెస్ డైరెక్టర్ క్వోన్ యంగ్హూన్, టీమ్ లీడర్ హోంగ్ సున్జూన్ లతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో సముద్ర రవాణా, షిప్‌బిల్డింగ్ పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. పారిశ్రామిక, ఆప్ షోర్ ఇంజనీరింగ్ స్థాపనకు ప్రపంచస్థాయి అవకాశాలను, ఆంధ్రప్రదేశ్ ఇస్తున్న ప్రత్యేక ప్రయోజనాలను వివరించారు. సుమారు 1053 కి.మీ.ల సుదీర్ఘ తీరప్రాంతంతో భారత తూర్పు తీరంలో ఏపీ వ్యూహాత్మక ప్రాంతంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఆరు పోర్టులతోపాటు కొత్తగా రాబోయే డీప్-వాటర్ పోర్టులు, ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రియల్ ఎకో సిస్టమ్, పెట్టుబడిదారులకు అనుకూల పాలసీలు ఏపీ ప్రత్యేకతలుగా వివరించారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాల వల్ల పెట్టుబడిదారులు తమ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి రూపొందించిన గవర్నెన్స్ మోడల్ అని తెలిపారు.