News9th Jul 12:04 PMSunil Byrisetty1 min read
ఏపీలో కొరియా డిస్ ప్లే పరికరాల తయారీ యూనిట్
సెమీకండక్టర్స్, OLED, పెరోవ్‌స్కైట్ డిపాజిషన్ పరికరాల తయారీలో పేరెన్నికగన్న సునిక్ సిస్టమ్ కో., లిమిటెడ్ (దక్షిణ కొరియా) సీఈవో ఎస్.డబ్ల్యూ. చుంగ్, సంస్థ ఉన్నతస్థాయి బృందంతో మంత్రి
సెమీకండక్టర్స్, OLED, పెరోవ్‌స్కైట్ డిపాజిషన్ పరికరాల తయారీలో పేరెన్నికగన్న సునిక్ సిస్టమ్ కో., లిమిటెడ్ (దక్షిణ కొరియా) సీఈవో ఎస్.డబ్ల్యూ. చుంగ్, సంస్థ ఉన్నతస్థాయి బృందంతో మంత్రి నారా లోకేష్ సియోల్ లో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీసిటీలో సునిక్ సిస్టమ్స్ డిస్ ప్లే పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఏపీలో యూనిట్ ఏర్పాటుకు ముందుకు వస్తే జాయింట్ వెంచర్ కోసం సహకారం అందిస్తామన్నారు. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0తోపాటు ఏపీ సెమీ కండక్టర్, డిస్ ప్లే ఫ్యాబ్ పాలసీ కింద ప్రోత్సాహకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ‘సెమీకాన్ టెక్’ పై నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించడానికి, ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేయాలని కోరారు. సునిక్ సిస్టమ్స్ సీఈవో ఎస్.డబ్ల్యు. చుంగ్ మాట్లాడుతూ... మూడు విభాగాలలో వాక్యూమ్ థిన్-ఫిల్మ్ డిపోజిషన్ పరికరాలను తాము తయారు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఏపీలో తమ సంస్థ ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని అన్నారు.