News10th Jun 05:27 PMSunil Byrisetty1 min read

మంత్రి లోకేష్ సొంత నిధులతో కర్మకాండల సత్రం

ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో సీతానగరంలోని పుష్కర ఘాట్ వద్ద కర్మకాండల సంత్రం నిర్మిస్తున్నారు. కర్మకాండల సత్రం లేక స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విషయంను స

మంత్రి లోకేష్ సొంత నిధులతో కర్మకాండల సత్రం
ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో సీతానగరంలోని పుష్కర ఘాట్ వద్ద కర్మకాండల సంత్రం నిర్మిస్తున్నారు. కర్మకాండల సత్రం లేక స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విషయంను స్థానిక నాయకులు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన ఆయన తన సొంత నిధులు రూ 8 లక్షల రూపాయలతో కర్మకాండల సత్రం నిర్మిస్తున్నారు. ఆ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. సత్రంలో తగిన సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సత్రం పూర్తి అయితే తాడేపల్లి ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది. లోకేష్ ఇప్పటికే తన సొంత నిధులతో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తమ‌కాళ్ల మీద తాము నిల‌బ‌డుతూ ఉపాధి పొందుతున్న బ‌డుగుజీవుల‌కు తోడ్పాటు అందించాల‌ని వివిధ రకాల బండ్లను చేయించి అందిస్తున్నారు. ఉపాధి కోసం మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ అందించిన తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లు, ఇస్త్రీ బండ్లు, కూరగాయల బండ్లు ఆయా కుటుంబాల జీవనోపాధికి ఎంతగానో దోహదపడుతున్నాయి.
Andhra Pradesh news
Nara lokesh
Pushkara Ghat
Karmakandala hostel
own funds
8 లక్షల రూపాయలతో కర్మకాండల సత్రం
నారా లోకేష్ సొంత నిధులతో పుష్కర ఘాట్ వద్ద కర్మకాండల సత్రం
Scroll for the next article