Politics22nd Mar 08:46 AMSunil Byrisetty1 min read

మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేష్

మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రాష్ట్రంలో ఫీజు బకాయిలపై విద్యార్థుల ఆందోళన గుర్తించిన మంత్రి లోకేష్ మాట ఇచ్చారు. ఫీజు రీయంబర్స్ మెంట్ నిధులు విడుదల చేస్తానని హామీ

మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేష్
మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రాష్ట్రంలో ఫీజు బకాయిలపై విద్యార్థుల ఆందోళన గుర్తించిన మంత్రి లోకేష్ మాట ఇచ్చారు. ఫీజు రీయంబర్స్ మెంట్ నిధులు విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగా తాజాగా కోసం 600 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. 2024-25 ఏడాదికి సంబంధించి అదనపు మొత్తం విడుదల చేశామని ఉన్నత విద్యాశాఖ తెలిపింది. ఇప్పటికే మొదటి విడతగా ఫీజు రీయంబర్స్ మెంట్ కు 788 కోట్లు చెల్లించింది. మరో రూ.400 కోట్లు విడుదల చేస్తామని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ప్రకటించారు. దశలవారీగా బకాయిలన్నీ చెల్లిస్తామని విద్యాసంస్థలకు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫీజులు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి తేవద్దన్న ప్రభుత్వం, ఇబ్బందిపెడితే కాలేజీలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
Nara Lokesh
Andhra Pradesh
ఫీజు రీయంబర్స్ మెంట్
విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్
Scroll for the next article