News18th Jun 12:09 PMSunil Byrisetty1 min read
ఢిల్లీలో పర్యటిస్తున్న మంత్రి లోకేష్
ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌తో సమా
ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌తో సమావేశం అవుతారు. మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో మంత్రి లోకేష్ భేటీ కానున్నారు. సాయంత్రం 4.30 గంటలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో, 5.30 గంటలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌తో భేటీ కానున్నారు. 19వ తేదీ గురువారం ఉదయం కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో భేటీ కానున్నారు. అనంతరం యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో సమావేశం అవుతారు