Education19th Mar 04:29 PMSunil Byrisetty1 min read

12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు

గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు దారుణంగా పడిపోయాయని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అసర్ నివేదిక, 2018లో పాఠశాలల్లో సదుపాయాలు,

12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు
గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు దారుణంగా పడిపోయాయని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అసర్ నివేదిక, 2018లో పాఠశాలల్లో సదుపాయాలు, విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఉండి, 2022-24 మధ్యకాలంలో పతనం కావడంపై మాట్లాడారు. 8వ తరగతి విద్యార్థులు రెండో తరగతి తెలుగు పుస్తకాన్ని 2014లో సుమారు 80 శాతం మంది చదవగలిగితే.. 2024కు వచ్చేనాటికి 53 శాతానికి పడిపోయిందన్నారు. మూడో తరగతి విద్యార్థుల్లో 85 శాతం మంది విద్యార్థులు కనీసం రెండో తరగతి టెక్ట్స్ బుక్ చదవలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 90 శాతం మంది మూడో తరగతి విద్యార్థులకు బేసిక్ ఫౌండేషన్ న్యూమరసీ స్కిల్స్ కూడా లేవని అసర్ నివేదిక తేటతెల్లం చేసిందని వివరించారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కలిపి సుమారు 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారని చెప్పారు. ఇప్పుడు ఆ సంఖ్య 33.4 లక్షలుగా ఉందన్నారు. వైసీపీ పాలనలో అనాలోచిత నిర్ణయాలు, చర్చ లేకుండా సంస్కరణలు తీసుకువచ్చి విద్యార్థులు, ఉపాధ్యాయులపై, తల్లిదండ్రులపై రుద్దారని విమర్శించారు. 117 జీవోలో స్థానిక అంశాలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చేరారన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు 10,15 సంస్కరణలు తీసుకువస్తున్నామని వివరించారు.
Govt Schools
Nara Lokesh
Andhra Pradesh
ప్రభుత్వ పాఠశాల
వైసీపీ
Scroll for the next article