Politics10th Sep 10:07 AMSunil Byrisetty1 min read

రెడ్‌బుక్‌లో చాలా ఉన్నాయి

ఇకపై తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి పెడతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. సీఎంని కలవాలంటే అప్పాయింట్‌మెంట్‌ అవసరంకానీ.. పార్టీ ఆఫీసుకు ఎవరు ఎప్పుడొచ్చినా

రెడ్‌బుక్‌లో చాలా ఉన్నాయి
ఇకపై తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి పెడతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. సీఎంని కలవాలంటే అప్పాయింట్‌మెంట్‌ అవసరంకానీ.. పార్టీ ఆఫీసుకు ఎవరు ఎప్పుడొచ్చినా ఫిర్యాదులు తీసుకుంటామన్నారు. 2029 ఎన్నికల్లో కూడా మోదీకే తమ మద్దతు ఉంటుందన్నారు. కేటీఆర్‌ని కూడా కలుస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుమార్తె కవితను టీడీపీలో తీసుకోవడమంటే.. జగన్‌ని పార్టీలో చేర్చుకోవడమేనంటూ లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్‌బుక్‌లో చాలా ఉన్నాయన్న లోకేష్‌.. అన్నీ బయటికొస్తాయన్నారు. వైసీపీ నేతలెవరూ అవినీతి జరగలేదని చెప్పడం లేదు. దొరికిపోతానన్న భయంతోనే జగన్ బెంగుళూరులో ఉన్నారన్నారు. తెలంగాణపై టీడీపీ ఫోకస్ చేస్తోందని.. త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
Andhra Pradesh
Red Book
TDP
Nara Lokesh
Telangana Politics
KCR
Kavitha
YSRCP
Jagan
Election 2029
పార్టీ బలోపేతం
రాజకీయ వ్యాఖ్యలు
అవినీతి ఆరోపణలు
Scroll for the next article