News26th Aug 12:36 PMSunil Byrisetty1 min read
లోకేష్ చొరవతో మహిళా ర్యాపిడో డ్రైవర్లు
ఆంధ్రప్రదేశ్ మహిళలు సరికొత్త మార్గంలో పయనిస్తున్నారు. మెప్మా సహకారంతో స్వయం ఉపాధి పొందుతూ వారి కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. చేతిలోని స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తూ, ఎలక్ట్రిక్ స్కూ
ఆంధ్రప్రదేశ్ మహిళలు సరికొత్త మార్గంలో పయనిస్తున్నారు. మెప్మా సహకారంతో స్వయం ఉపాధి పొందుతూ వారి కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు. చేతిలోని స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తూ, ఎలక్ట్రిక్ స్కూటర్ నడుపుతూ సొంతంగా సంపాదిస్తున్నారు. విశాఖపట్నంలో 400 వాహనాలు , విజయవాడలో 400, నెల్లూరు, గుంటూరులో 50 చొప్పున, కర్నూలు, తిరుపతి, కాకినాడ, రాజమండ్రిలో 25 వాహనాలు చొప్పున మహిళలకు అందజేశారు. వీటిలో 760 ఎలక్ట్రిక్ టూ-వీలర్లు కాగా, 240 ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు ఉన్నాయి. మహిళలు సాధికారత సాధించాలనేది ప్రభుత్వ ఆలోచన అని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ మహిళా రిజర్వేషన్లను ప్రవేశపెట్టడంతోపాటు, అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ర్యాపిడోతో కలిసి రాష్ట్రంలో 1000 మందికి పైగా మహిళలు స్వీయ ఉపాధి సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో మరింత చేస్తామని మంత్రి నారా లోకేష్ వివరించారు.