Politics17th Sep 11:12 AMSunil Byrisetty1 min read

రాజకీయాల్లో హుందాతనానికి ప్రతీక ఆళ్ల నాని

ఆంధ్రప్రదేశ్‌ ఒక మంచి వ్యక్తిని కోల్పోయిందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఉపముఖ్యమంత్రి, టీడీపీ నేత ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) పార్థి

రాజకీయాల్లో హుందాతనానికి ప్రతీక ఆళ్ల నాని
ఆంధ్రప్రదేశ్‌ ఒక మంచి వ్యక్తిని కోల్పోయిందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఉపముఖ్యమంత్రి, టీడీపీ నేత ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) పార్థివదేహానికి మంత్రి నారా లోకేష్ ఘన నివాళులర్పించారు. గురువారం ఏలూరులోని ఆళ్ల నాని నివాసానికి చేరుకున్న లోకేష్.. ఆళ్ల నాని పార్థివదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నాని కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. లోకేష్ మాట్లాడుతూ.. "ఆళ్ల నాని మృతి బాధాకరం. ఆంధ్ర రాష్ట్రం ఒక మంచి వ్యక్తిని కోల్పోయింది. నాని అన్న మంత్రిగా ఉన్న సమయంలో నేను ఎమ్మెల్సీగా ఉన్నాను. సభలో అనేక అంశాలపై ఆయనతో చర్చించేవాడిని. అయితే ఏనాడూ వ్యక్తిగత విమర్శలకు వెళ్లకుండా హుందాతనంగా ఆయన వ్యవహరించేవారు" అని లోకేష్ తెలిపారు.
Andhra Pradesh Politics
AP News
TDP
Telugu Desam Party
Alla Nani
Nara Lokesh
తెలుగుదేశం పార్టీ
ఏలూరు
రాజకీయ వార్తలు
నివాళులు
Scroll for the next article