News15th Oct 05:19 PMSunil Byrisetty1 min read

సమిష్టి కృషి వల్లే రాష్ట్రానికి గూగుల్

చరిత్ర సృష్టించాలన్నా, తిరగరాయాలన్నా కేవలం చంద్రబాబు వల్లే సాధ్యమని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఉండవల్లి నివాసంలో ఆయన మాట్లాడుతూ... చంద్రబాబ

సమిష్టి కృషి వల్లే రాష్ట్రానికి గూగుల్
చరిత్ర సృష్టించాలన్నా, తిరగరాయాలన్నా కేవలం చంద్రబాబు వల్లే సాధ్యమని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఉండవల్లి నివాసంలో ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు 2014-19 నడుమ ఇండియా లార్జెస్ట్ ఆటోమోటివ్ ఎఫ్ డిఐ కియా తెచ్చారన్నారు. ఇప్పుడు ఆ చరిత్రను తిరగరాస్తున్నామని చెప్పారు. ఇండియా సింగిల్ లార్జెస్ట్ ఎఫ్ డిఐ ఇన్వెస్టిమెంట్ ఇన్ హిస్టరీ, ఏపీలో గూగుల్ 15 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతుందని వివరించారు. అమెరికా వెలుపల గూగుల్ లార్జెస్ట్ డేటా సెంటర్ ఇదని తెలిపారు. అనేక దేశాలు, రాష్ట్రాల్లో అధ్యయనం చేసి ఎపికి వెళ్తేనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ వల్ల పెట్టుబడి పెట్టగలం, ఇబ్బంది ఉండదని గ్రహించి వారు రాష్ట్రానికి వచ్చారని చెప్పారు. గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలు మార్చిన విధంగానే.. ఇప్పుడు గూగుల్ విశాఖ రూపురేఖలు మార్చబోతోందన్నారు. ఇది కేవలం ఒక్క డాటా సెంటర్ గురించి మాత్రమే కాదు. కేబుల్ ల్యాండింగ్ స్టేషన్, రెన్యువబుల్ ఎనర్జీ, ఎఐకి సంబంధించి అనేక అనుబంధ కంపెనీలు విశాఖకు వస్తాయని చెప్పారు.ఈ ఒక్క పెట్టుబడివల్ల 1,88,000 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయని, స్థానిక ఆర్థిక వ్యవస్థపై అయిదేళ్లలో రూ.48వేలకోట్ల ప్రభావం చూపుతుందని లోకేష్ వివరించారు.
Andhra Pradesh
Nara Lokesh
Google Investment
Chandrababu Naidu
Visakhapatnam
FDI
Google Data Center
రాష్ట్ర అభివృద్ధి
కృత్రిమ మేధస్సు
పునరుత్పత్తి శక్తి
భారత ఆర్థిక వ్యవస్థ
Scroll for the next article