News11th Sep 09:34 AMSunil Byrisetty1 min read
డీఎస్సీ పై జగన్ విమర్శలకు లోకేష్ కౌంటర్ వీడియో
డీఎస్సీ పై జగన్ విమర్శలకు కౌంటర్ ఇస్తూ మంత్రి నారా లోకేష్ వీడియో విడుదల చేశారు. డీఎస్సీ పై జగన్ విషం కక్కడం బాధాకరమన్నారు. డీఎస్సీకి ఏపీపీఎస్సీకి తేడా జగన్ కు తెలుసా అని ప్రశ్నించా
డీఎస్సీ పై జగన్ విమర్శలకు కౌంటర్ ఇస్తూ మంత్రి నారా లోకేష్ వీడియో విడుదల చేశారు. డీఎస్సీ పై జగన్ విషం కక్కడం బాధాకరమన్నారు. డీఎస్సీకి ఏపీపీఎస్సీకి తేడా జగన్ కు తెలుసా అని ప్రశ్నించారు. వైసిపి ఐదేళ్ల పాలనలో భర్తీ చేసిన టీచర్ పోస్టులు సున్నా అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తొలి సంతకం డీఎస్సీ పైనే చేసి, 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశారని పేర్కొన్నారు. డీఎస్సీ ప్రక్రియను అడ్డుకునేందుకు సుమారు 300 కేసులు వేసినా కోర్టులు ప్రభుత్వాన్ని తప్పు పట్టలేదని గుర్తు చేశారు. డీఎస్సీపై ప్రతి ఆరోపణకు అధికారులు ఆధారాలతో సహా సమాధానం ఇచ్చారన్నారు. టీచర్లపై ఒత్తిళ్లు, దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని పేర్కొన్నారు. త్వరలోనే కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.