Politics17th Mar 04:44 PMSunil Byrisetty1 min read

పారిపోయిన వైసీపీ నేతలను మార్షల్స్‌తో తెండి

వైసీపీ హయాంలో టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపేందుకు ప్రయత్నించారని, ఇప్పుడు ఆ అంశంపై చర్చలో పాల్గొనకుండా ఆరోపణలు చేసి పారిపోతున్నారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోక

పారిపోయిన వైసీపీ నేతలను మార్షల్స్‌తో తెండి
వైసీపీ హయాంలో టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపేందుకు ప్రయత్నించారని, ఇప్పుడు ఆ అంశంపై చర్చలో పాల్గొనకుండా ఆరోపణలు చేసి పారిపోతున్నారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. శాసనమండలిలో 2019-24 మధ్య అవినీతి, అక్రమాలపై చర్చను నిరసిస్తూ వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. దీనిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ.. అజెండా బీఏసీ నిర్ణయిస్తుందన్నారు. అందరూ చర్చించి నిర్ణయం తీసుకున్నారన్నారు. 2019-24 మధ్య జరిగిన అవినీతి, అక్రమాలు, కుంభకోణాల అంశంపై చర్చకు అనుమతిస్తూ మండలి ఛైర్మన్ ఆదేశాలు జారీచేశారని తెలిపారు. బీఏసీలో వైసీపీ సభ్యులు అంగీకరించారని గుర్తు చేశారు. చర్చలో వైసీపీ సభ్యులు 2014-19 మధ్య జరిగిన పాలనపై ఆరోపణలు చేసి.. ఇప్పుడు సమాధానం ఇస్తుండగా వాకౌట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యులు ఆరోపణలు చేసి పారిపోతారని, సమాధానానికి సమయం ఇవ్వరని, మేం సమాధానం ఇచ్చే సమయంలో సభలో ఉండరని ఎద్దేవా చేశారు. ఇది మొదటిసారి కాదని, పదేపదే ఈ విధంగా చేస్తున్నారని విమర్శించారు. ఇది సరికాదని, చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. గతంలో మార్షల్స్ ను పెట్టి సభను నడిపించిన పరిస్థితి ఉందని, ఇప్పుడు మార్షల్స్ ను పెట్టి బయట ఉన్న సభ్యులను సభకు తీసుకురావాలని ఛైర్మన్‌ను లోకేష్ కోరారు. ఆ అధికారం ఛైర్మన్ కు ఉందన్నారు.
TDP
Nara Lokesh
YS Jagan
Andhra Pradesh News
assembly
Marshals
వైసీపీ
టీడీపీ
Scroll for the next article