News12th Jun 04:19 PMSunil Byrisetty1 min read
పదేళ్లలో రాని పెట్టుబడులు ఏడాదిలో..!
సంక్షేమం, అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వానికి జోడెద్దుల బండి అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కూటమి పాలన ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా ఉండవల్లి నివాసంలో ఏర్పా
సంక్షేమం, అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వానికి జోడెద్దుల బండి అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కూటమి పాలన ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా ఉండవల్లి నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రజలు, ప్రజాస్వామ్యం గెలిచి ప్రజాపాలన ఏర్పడి ఏడాది పూర్తిచేసుకుంటున్నామన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు పడింది. విధ్వంస పాలన నుంచి ఏకంగా వికాసం వైపు మన ప్రభుత్వం ప్రయాణం ప్రారంభించిందన్నారు. కేంద్రంలో ప్రధానమంత్రి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వలో ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోందని తెలిపారు. ఉద్యోగాల విషయంలో మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టులు ప్రజా ప్రభుత్వం భర్తీ చేస్తోందన్నారు. డీఎస్సీని ఎట్టిపరిస్థితుల్లో ఆపాలని ప్రతిపక్ష పార్టీ సుమారు 24 కేసులు వేసిందన్నారు. ఈ రోజుతో 24వ కేసు కూడా సుప్రీంకోర్టులో డిస్మిస్ అయింది. అవన్నీ తట్టుకుని డీఎస్సీ ప్రక్రియను పూర్తిచేస్తున్నామని లోకేష్ వివరించారు.