Education3rd Mar 11:46 AMSunil Byrisetty1 min read

త్వరలోనే మెగా డిఎస్సీ: మంత్రి లోకేష్

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డిఎస్సీ ప్రకటిస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వైసిపి సభ్యులు తాటి

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డిఎస్సీ ప్రకటిస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వైసిపి సభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ (సంతనూతలపాడు), ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి (రాజంపేట), రేగం మత్స్యలింగం (అరకు), బి.విరూపాక్షి (ఆలూరు) పంపిన ప్రశ్నకు మంత్రి లోకేష్ శాసనసభలో సమాధానమిచ్చారు. ఇదిలావుండగా... గత వైసిపి ప్రభుత్వం అయిదేళ్ల హయాంలో ఒక్క డిఎస్సీ కూడా విడుదల చేయలేదు. గత 30ఏళ్లలో టిడిపి ప్రభుత్వాల హయాంలో 13 డిఎస్సీలను నిర్వహించి, 1,80,272 టీచర్ పోస్టులను భర్తీచేశారు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ లో 2014-19 నడుమ చంద్రబాబునాయుడు గారి నేతృత్వంలోని టిడిపి ప్రభుత్వం 2014,18,19లలో మూడు డిఎస్సీల నిర్వహణ ద్వారా 16,701 టీచర్ పోస్టులను భర్తీచేసింది.
Ap Dsc
Ap Dsc Notification
Telugu News
Nara Lokesh
ఏపీ డీఎస్సీ
నోటిఫికేషన్
తెలుగు వార్తలు
నారా లోకేష్
Scroll for the next article