News19th Nov 02:20 PMSunil Byrisetty1 min read

బాబా నన్ను బంగారూ అని పిలిచినట్లుంటుంది

ప్రశాంతి నిలయం ప్రశాంతతకు ఆలయమని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. పుట్టపర్తికి వచ్చిన ప్రతిసారీ బాబా తనను బంగారూ అని పిలిచినట్లు అనిపిస్తుందని చెప్పారు. మనుషుల్లో ప్రేమ ఉన్నంత వరకు

బాబా నన్ను బంగారూ అని పిలిచినట్లుంటుంది
ప్రశాంతి నిలయం ప్రశాంతతకు ఆలయమని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. పుట్టపర్తికి వచ్చిన ప్రతిసారీ బాబా తనను బంగారూ అని పిలిచినట్లు అనిపిస్తుందని చెప్పారు. మనుషుల్లో ప్రేమ ఉన్నంత వరకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మన మధ్యలోనే ఉంటారని అన్నారు. శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రశాంతి నిలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. బాబా శతజయంతి కేవలం ఓ వేడుక కాదని, ఇది లోతైన, దైవిక కృతజ్ఞతా క్షణమని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ప్రేమ, సేవ, శాశ్వతమైన విలువల ద్వారా మానవాళిని మార్చిన వందేళ్ల పవిత్ర ప్రయాణమని అన్నారు. ఈ సందర్భంగా భగవాన్ శ్రీ సత్య సాయిబాబా చారిత్రాత్మక శతాబ్ది ఉత్సవాల నిర్వాహకులకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనడం తన అదృష్టమని చెప్పారు.
Andhra Pradesh
Sri Sathya Sai Baba
Prasanthi Nilayam
Centenary Celebrations
Naralokesh
Spirituality
Devotion
Divine Love
Service
బాబా వారసత్వం
హృదయపూర్వక సందేశాలు
మానవ విలువలు
Scroll for the next article