Politics8th Mar 06:18 PMSunil Byrisetty1 min read

కర్ణాటకకు బెంగుళూరు, తెలంగాణకు హైదరాబాద్.. ఏపీకి చంద్రబాబు

కర్టాటకకు బెంగుళూరు, తమిళనాడు చెన్నై, తెలంగాణకు హైదరాబాద్ సిటీలు ఉన్నాయి. కానీ ఏపీకి మాత్రం చంద్రబాబునాయుడు గారు ఉన్నారు. ఆయనే మాకు అడ్వాంటేజ్. ఈ శుక్రవారం టాటా పవర్ తో 7 గిగా వాట్

కర్ణాటకకు బెంగుళూరు, తెలంగాణకు హైదరాబాద్.. ఏపీకి చంద్రబాబు
కర్టాటకకు బెంగుళూరు, తమిళనాడు చెన్నై, తెలంగాణకు హైదరాబాద్ సిటీలు ఉన్నాయి. కానీ ఏపీకి మాత్రం చంద్రబాబునాయుడు గారు ఉన్నారు. ఆయనే మాకు అడ్వాంటేజ్. ఈ శుక్రవారం టాటా పవర్ తో 7 గిగా వాట్స్ ఒప్పందం జరిగింది. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. నైపుణ్యగణన కంటే కుల గణన చాలా సులభం. రాష్ట్రంలో నైపుణ్య గణనను ఛాలెంజ్ గా తీసుకుని పనిచేస్తున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఇండియా టుడే గ్రూప్ ఆధ్వర్యంలో జరిగిన కాంక్లేవ్ లో మంత్రి మాట్లాడారు. రాజకీయాలకు పాదయాత్ర చాలా ముఖ్యమన్నారు. పాదయాత్ర రాజకీయాల్లో ఎంబీయే వంటిదన్నారు. పాదయాత్ర ద్వారా సమస్యలను మరింత బాగా అర్థంచేసుకోగలగుతున్నానని, నియోజకవర్గాలకు వెళ్లినప్పుడు ప్రజలతో మమేకం అవుతున్నానని వివరించారు. వాట్సప్ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయాలనే ఆలోచన పాదయాత్రలో వచ్చిందన్నారు. నెలాఖరునాటికి 350 సేవలను మనమిత్ర ద్వారా ప్రజలకు అందించనున్నామని తెలిపారు. కుల ధ్రువపత్రాలు, హాల్ టికెట్లు, ఇతర పత్రాలు,ల్యాండ్ రికార్డులను సులభంగా వాట్సాప్ సేవలో పొందవచ్చని సూచించారు. ఇది ప్రారంభం మాత్రమేనని, భవిష్యత్ లో మరిన్ని సేవలను ప్రజలక అందుబాటులోకి తీసుకువస్తామని, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ కు అందరూ సిద్ధంగా ఉండాలని మంత్రి లోకేష్ సూచించారు.
Delimitation
Southernstates
Naralokesh
Andhra Pradesh
డీలిమిటేషన్
దక్షిణ రాష్ట్రాలు
నరలోకేష్
ఆంధ్రప్రదేశ్
Scroll for the next article