News23rd Jul 03:35 PMSunil Byrisetty1 min read

డేటా విప్లవంతోఅవకాశాలను అందిపుచ్చుకుంటాం

డేటా విప్లవం ద్వారా అంతర్జాతీయంగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందువరుసలో నిలుస్తోందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. విజయవ

డేటా విప్లవంతోఅవకాశాలను అందిపుచ్చుకుంటాం
డేటా విప్లవం ద్వారా అంతర్జాతీయంగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందువరుసలో నిలుస్తోందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. విజయవాడ నోవాటెల్ హోటల్ లో ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు ఆధ్వర్యాన జరిగిన ఇన్వెస్టోపియా గ్లోబల్ – ఆంధ్రప్రదేశ్ సదస్సులో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎఐ & డాటా సెంటర్లపై జరిగిన చర్చలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. సౌత్ ఏషియాలోనే తొలి 152 బిట్ క్వాంటమ్ కంప్యూటర్ ఎపి రాజధాని అమరావతిలో జనవరిలో ఆవిష్కృతం కాబోతోందని చెప్పారు. ఇది యావత్ ఎకో సిస్టమ్ ను మార్చబోతుందన్నారు. విశాఖపట్నం డేటా సిటీగా అభివృద్ధి చెందుతోందని, అంతర్జాతీయంగా పలు ప్రఖ్యాత సంస్థలో విశాఖలో తమ డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయని వివరించారు. ఇప్పటివరకు సాంప్రదాయ విద్యావిధానం కొనసాగుతున్న నేపథ్యంలో ఎఐ వంటి అధునాతన సాంకేతికతకు ట్రాన్సఫార్మేషన్ కష్టతరమైన పనే. అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యలో ఎఐ స్కిల్ డెవలప్ ప్రోగ్రామ్ లను ప్రవేశపెడుతున్నామని వివరించారు. ఎఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి పాఠ్యాంశాలతో కరిక్యులమ్ లో సమూల మార్పులు తెస్తున్నామని వెల్లడించారు.
Andhra Pradesh news
Amaravati
Nara Lokesh
Data revolution
AI
Quantum Computing
Data centers
ఎమర్జింగ్ టెక్నాలజీస్
క్వాంటమ్ కంప్యూటింగ్
Scroll for the next article