News28th Nov 04:15 PMSunil Byrisetty1 min read

దేవతల రాజధానిని దెయ్యాలు విధ్వంసం చేయాలని చూశాయి

'దేవతల రాజధాని, రైతుల త్యాగం అమరావతిని దెయ్యాలు విధ్వంసం చెయ్యాలని చూశాయి. మూడు రాజధానులపేరుతో మూడుముక్కలాట ఆడి ఒక్క ఇటుక పెట్టలేదు. నాటి ముఖ్యమంత్రి ఉండటానికి మాత్రం 700 కోట్ల తో

దేవతల రాజధానిని దెయ్యాలు విధ్వంసం చేయాలని చూశాయి
'దేవతల రాజధాని, రైతుల త్యాగం అమరావతిని దెయ్యాలు విధ్వంసం చెయ్యాలని చూశాయి. మూడు రాజధానులపేరుతో మూడుముక్కలాట ఆడి ఒక్క ఇటుక పెట్టలేదు. నాటి ముఖ్యమంత్రి ఉండటానికి మాత్రం 700 కోట్ల తో ప్యాలెస్ కట్టుకున్నారు. ఎన్ని కుట్రలు చేసిన జై అమరావతి అన్న నినాదాన్ని ఆపలేకపోయార'ని విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమరావతిలో 15 జాతీయ బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉద్దండరాయునిపాలెంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. 'చిన్న పిల్లాడి నుండి 80ఏళ్ల వృద్దుల వరకు జై అమరావతి అంటూ జెండా పట్టారు. జై అమరావతి అన్నందుకు రైతులకు సంకెళ్లు వేశారు, మహిళా రైతులను పోలీసులతో బూటుకాళ్లతో తన్నించారు. 1631 రోజులు జరిగిన అమరావతి ఉద్యమం ఒక చరిత్ర. 270 మంది రైతులు చనిపోయారు, 3 వేల మంది రైతులపై కేసులు పెట్టారు. ఆపేస్తే అగిపోవడానికి అది ఎవరి ఇంట్లో స్విచ్ కాదు, అమరావతికి శంకుస్థాపన చేసింది ప్రధాని నరేంద్ర మోడీ. ముఖ్యమంత్రి అడిగిన వెంటనే ప్రధాని మోడీజీ అమరావతి నిర్మాణానికి 15 వేల కోట్లు ఇవ్వడానికి అంగీకరించారు. ఇప్పుడు మంత్రి నారాయణ అధ్వర్యంలో అమరావతి పనులు జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి. ఒకే రాజధాని, అభివృద్ది వికేంద్రీకరణ ప్రజా ప్రభుత్వం విధానమ’ని లోకేష్ స్పష్టం చేశారు.
Andhra Pradesh
Amaravati
Nara Lokesh
Capital Controversy
Three Capitals Issue
Farmers Protest
Narendra Modi
Nirmala Sitharaman
నరేంద్రమోదీ
అమరావతి ఉద్యమం
అభివృద్ధి
బ్యాంకింగ్ స్ట్రీట్
రాజధాని నగరం
Scroll for the next article