News30th Jul 12:10 PMSunil Byrisetty1 min read

మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్‌కు మంత్రి లోకేష్

రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ బృందం సింగపూర్ సెసిల్ స్ట్రీట్ లోని మైక్రోసాఫ్ట్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను సందర్శించారు. అక్కడ ఎఐ గోస్టోర్ లోని వివిధ పరి

మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్‌కు మంత్రి లోకేష్
రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ బృందం సింగపూర్ సెసిల్ స్ట్రీట్ లోని మైక్రోసాఫ్ట్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను సందర్శించారు. అక్కడ ఎఐ గోస్టోర్ లోని వివిధ పరిశ్రమలు, ఆరోగ్య సంరక్షణ, ఎఫ్ఎస్ఐ, తయారీ, వినియోగదారు పరిశ్రమల్లో ఎఐ వినియోగ దృశ్యాలను పరిశీలించారు. సంస్థ ప్రతినిధులు ఎక్స్ పీరియన్స్ సెంటర్ ప్రత్యేకతలను వివరిస్తూ.. వ్యాపారులు, వినియోగదారులు, ప్రేక్షకుల కోసం సంయుక్తంగా రిటైల్, ఎడ్యుకేషన్ మద్దతును అందించేందుకు మైక్రోసాఫ్ట్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎగ్జిక్యూటివ్ బ్రీఫింగ్‌లు, పరిశ్రమ పరిష్కారాలను ఊహించడం, ఆవిష్కరణల వర్క్‌షాప్‌లు, హ్యాండ్స్-ఆన్ ల్యాబ్‌లు, క్లయింట్ల డిజిటల్ పరివర్తన మార్గాలపై దృష్టి సారించడం వరకు ఇక్కడ తమసేవలు విస్తరించినట్లు చెప్పారు. ముఖ్యంగా ఈ కేంద్రాలను IBM, Dell వంటి కీలకమైన Microsoft కస్టమర్లు, ప్రభుత్వ రంగ సంస్థలు టెక్నాలజీ ఇంటిగ్రేషన్, ట్రాన్సఫర్మేషన్ కోసం ఉపయోగిస్తున్నాయని తెలిపారు. IBM-Microsoft ఎక్స్‌పీరియన్స్ జోన్ ప్రత్యేకంగా క్లయింట్‌లకు Azure, Copilot వంటి సాంకేతికతలను ఉపయోగించి AI-ఆధారిత వ్యాపార పరిష్కారాలను చూపడంలో సహకరిస్తుందని చెప్పారు.
Andhra Pradesh
Nara Lokesh
Microsoft Experience Center
Singapore
Artificial Intelligence
AI in Healthcare
AI in Manufacturing
Azure
Copilot
Microsoft AI
IBM-Microsoft Collaboration
మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ
తయారీ పరిశ్రమలో ఎఐ
Scroll for the next article