News8th Mar 09:40 AMSunil Byrisetty1 min read
మహిళా నేతలకు లోకేష్ శుభాకాంక్షలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేష్ మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఫొటోలు దిగారు. "సృష్టికి మూలమైన స్త్రీమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షల
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేష్ మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఫొటోలు దిగారు.
"సృష్టికి మూలమైన స్త్రీమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
మహిళా శక్తి అపారం. సమాన అవకాశాలు కల్పించి ప్రోత్సహిస్తే అద్భుతంగా రాణిస్తారు.
పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారతకు అన్ని విధాల అండగా నిలుస్తున్నాం.
మహిళా సంక్షేమం, భద్రత కోసం కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తోంది.
రాష్ట్రంలోని ప్రతి మహిళ సామాజిక, ఆర్థిక పురోగతి సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం.
తమతమ రంగాల్లో మహిళలు మరిన్ని విజయాలను సాధిస్తూ, అందరికీ స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాన"ని లోకేష్ తెలిపారు.