News7th May 11:09 AMSunil Byrisetty1 min read

శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి శుభాకాంక్షలు

ఆర్యవైశ్యుల ఆరాధ్యదైవం శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి మహోత్సవ వేడుకల సందర్భంగా విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారు సాక్షాత్తూ జగజ్

శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి శుభాకాంక్షలు
ఆర్యవైశ్యుల ఆరాధ్యదైవం శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి మహోత్సవ వేడుకల సందర్భంగా విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారు సాక్షాత్తూ జగజ్జనని పరమేశ్వరి అవతారమని పేర్కొన్నారు. స్త్రీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టినందుకు, విలువల కోసం జీవితాన్ని త్యాగం చేసిన వాసవీదేవి గొప్ప పుణ్యమూర్తిగా, వైశ్యులకు పూజ్యురాలిగా నిలిచిపోయారని కొనియాడారు. వాసవి కన్యాకపరమేశ్వ అమ్మవారి కథ అహింస, సమగ్రత, స్వయం త్యాగం విలువలను ప్రతిబింబిస్తుందని తెలిపారు. శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ప్రతిఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నానని మంత్రి పేర్కొ్న్నారు.
Andhra Pradesh
Nara Lokesh
Jayanti of Sri Vasavi Kanyaka Parameshwari Mata
శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి
Scroll for the next article