News11th Jul 03:11 PMSunil Byrisetty1 min read

లోకేష్‌ను పల్లి..పల్లి మంత్రి అన్న కొరియన్లు

మంత్రి నారా లోకేష్ సౌత్ కొరియా పర్యటన విజయవంతమైంది. ఈనెల 5నుంచి 11వరకు నిర్వహించిన అధికారిక పర్యటనలో 50కి పైగా కార్పోరేట్ సంస్థల నాయకత్వాన్ని కలిసి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్

లోకేష్‌ను పల్లి..పల్లి మంత్రి అన్న కొరియన్లు
మంత్రి నారా లోకేష్ సౌత్ కొరియా పర్యటన విజయవంతమైంది. ఈనెల 5నుంచి 11వరకు నిర్వహించిన అధికారిక పర్యటనలో 50కి పైగా కార్పోరేట్ సంస్థల నాయకత్వాన్ని కలిసి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా లోకేష్ కోరారు. తొలిరోజు సియోల్ లో తెలుగు ప్రజలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంతో ప్రారంభమైన పర్యటన... శుక్రవారం సీఐఐ ఆధ్వర్యాన పెట్టుబడిదారులతో నిర్వహించిన రోడ్ షోతో ముగిసింది. మంత్రి లోకేష్ తో నిర్వహించిన భేటీల అనంతరం ఎల్జీ, హ్యుందయ్, శాంసంగ్, బీఎన్ కే ఫైనాన్షియల్ వంటి దిగ్గజ కొరియన్ కార్పోరేట్ సంస్థలు పరిశీలిస్తామని హామీ ఇచ్చాయి. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న స్పష్టమైన పారిశ్రామిక విధానాలు, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, అందజేస్తున్న ప్రోత్సాహకాలపై మంత్రి లోకేష్ ఇచ్చిన ప్రజెంటేషన్ తో వివిధ సంస్థల ప్రతినిధి బృందాలు ఫిదా అయ్యాయి. ఏపీలో ఇచ్చే వేగవంతమైన అనుమతులపై మంత్రి లోకేష్ వివరించిన తీరుపై కొరియా మీడియా, దిగ్గజ కంపెనీలు సానుకూలంగా స్పందించాయి. మంత్రి లోకేష్ బృందం పర్యటనపై కోట్రా (Kotra) దక్షిణాసియా విభాగాధిపతి క్యుంగ్‌హూన్ కిమ్ హ్యాట్సాఫ్ అంటూ ట్విట్టర్ లో అభినందనలు తెలిపారు. లోకేష్ వేగం చూసిన కొరియన్ ప్రతినిధులు పల్లి..పల్లి మంత్రి అని కొత్త పేరు పెట్టారు. పల్లి..పల్లి అనే కొరియన్ పదానికి అర్థం త్వరగా.. త్వరగా అని.
Andhra Pradesh
South Korea
Nara Lokesh
Seoul
Investment Summit
Foreign Investment
LG
Hyundai
Samsung
పల్లి పల్లి మంత్రి
పారిశ్రామిక విధానం
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్
Scroll for the next article