News15th Dec 04:33 PMSunil Byrisetty1 min read
నరసాపురం- చెన్నై సెంట్రల్ వందే భారత్ ప్రారంభం
నరసాపురంలో కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ నరసాపురం- చెన్నై సెంట్రల్ వందే భారత్ ట్రైన్ సర్వీస్ ప్రారంభించారు. ఎంతోకాలంగా ప్రయాణికులు ఆకాంక్షిస్తున్న రైలు కలను సాకారం చేస్తూ
నరసాపురంలో కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ నరసాపురం- చెన్నై సెంట్రల్ వందే భారత్ ట్రైన్ సర్వీస్ ప్రారంభించారు. ఎంతోకాలంగా ప్రయాణికులు ఆకాంక్షిస్తున్న రైలు కలను సాకారం చేస్తూ ఈ ప్రారంభోత్సవం నిర్వహించారు.
అనంతరం సభలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, మంత్రి నిమ్మల రామానాయుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, భీమవరం ఎమ్మెల్యే పులవర్తి అంజిబాబు, నరసాపురం నాయకర్, మాజీ మంత్రులు కనుమూరి బాపిరాజు, పీతల సుజాత, తదితర ప్రముఖులు ప్రసంగించారు. జెండా ఊపి రైలు సర్వీసు ప్రారంభించిన కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ఎన్డీయే డబుల్ ఇంజిన్ సర్కార్ వందే భారత్ రైళ్లను తీసుకొచ్చిందన్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మతో రాజకీయ ప్రముఖులతో కలిసి.. నర్సాపూర్ నుంచి గుడివాడ వరకు వందేభారత్ రైలులో ఎమ్మెల్యే రాము ప్రయాణించారు.