News30th Jul 09:30 AMSunil Byrisetty1 min read
నింగిలోకి నిసార్ స్కానింగ్ శాటిలైట్ నేడే!
భూమిపై అణువణువునూ స్కాన్ చేసి జల్లెడ పట్టే భూపరిశీలన ఉపగ్రహం నిసార్ (నాసా-ఇస్రో సింథటిక్ అపార్చర్ రాడార్) ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెం
భూమిపై అణువణువునూ స్కాన్ చేసి జల్లెడ పట్టే భూపరిశీలన ఉపగ్రహం నిసార్ (నాసా-ఇస్రో సింథటిక్ అపార్చర్ రాడార్) ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి సాయంత్రం 5:40 గంటలకు జీఎఎస్ఎల్వీ-ఎఫ్16 రాకెట్ ద్వారా 2,392 కిలోల బరువున్న నిసార్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ఈ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ను మంగళవారం మధ్యాహ్నం 2:10 గంటలకు ప్రారంభించారు. కౌంట్‌డౌన్ 27:30 గంటలు కొనసాగిన తర్వాత షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎ్‌సఎల్వీ-ఎఫ్16 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇస్రో చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ ఈ ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ ఆలయంలో పూజలు చేశారు. ఇస్రో-నాసా సంయుక్తంగా తొలిసారిగా రూపొందించి ప్రయోగిస్తున్న ఉపగ్రహం కావడం విశేషం. ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు అమెరికా నుంచి నాసా శాస్త్రవేత్తలు కూడా షార్‌కు చేరుకున్నారు. గతంలో 2 ప్రయోగాలూ విఫలం కావడంతో శాస్త్రవేత్తలు జీఎ్‌సఎల్వీ-ఎఫ్16 రాకెట్ ప్రయోగ విషయంలో మరిన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు.